స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించండి
ప్రజాశక్తి - బేతంచెర్ల
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల పనిచేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. బుధవారం బేతంచర్లలోని ఆయన స్వగృహం నందు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లైన ఎంపీటీసీ, కౌన్సిలర్, జడ్పిటిసిలతో పశ్చిమ రాయలసీమ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ 2014 నుండి వైసిపి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయడం వల్లే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ అందరి కృషితో అధికస్థానాలను కైవాసం చేసుకోవడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోను అదే కృషితో పనిచేసే ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. స్థానిక సంస్థలకు చెందిన ఎంపీటీసీ, జడ్పిటిసి, కౌన్సిలర్ సభ్యులు డాక్టర్ మధుసూదన్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బేతంచర్ల మండలం ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, బేతంచర్ల నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, వైస్ ఎంపీపీ రంగస్వామి, వైస్ చైర్మన్ నాగ వెంకటేశ్వర్లు, గునీ నాగరాజు, మూర్తిజావలి, ఖాజా హుస్సేన్, మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.










