జమ్మలమడుగు రూరల్ : స్థానిక సమస్యలకు స్థానికంగానే పరిష్కారం అందించేలా మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలనే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జెసి గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జమ్మలమడుగు ఆర్‌డిఒ శ్రీనివాసులు హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే డా.సుధీర్ రెడ్డి హాజరై. ప్రజల తరపున సమస్యలను జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి రాలేని వారికి ఇది మంచి అవకాశం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. గ్రామ స్థాయి సమస్యలు, మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ప్రజా సమస్యలకు మెరుగైన, వేగవంతమైన పరిష్కారం అందించే దిశగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. 'జగన న్నకు చెబుదాం' కార్యక్రమం ద్వారా అందిన దరఖా స్తులను ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజల అర్జీలకు అధి కారులు అందించే పరిష్కార నివేదికలు కూడా స్పష్టంగా ఉండాలని ఇందులో నిర్లక్ష్యం చేస్తే సహిం చేది లేదని హెచ్చరించారు. అనంతరం జమ్మల మడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన క్షేత్ర స్థాయిలో ఎలా ఉంటుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఇక్కడికి వచ్చి ప్రజల ఫిర్యాదులను స్వీకరించి సమస్యల పరిష్కా రానికి చర్యలు తీసుకోవడం అభినందనీయం అని ప్రశంసించారు. స్థానికులు ఈ సదవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. జమ్మలమడుగు ప్రెస్ క్లబ్ తరుపున ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కలెక్టర్‌ను ప్రెస్ క్లబ్ కోసం స్థలంచ జమ్మలమడుగు విలేకరులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రతి విలేకరికి మూడు సెంట్లు స్థలం రోడ్డుకు అనువైన ప్రదేశంలో ఇవ్వాలని అధికారులకు సూచి ంచారు. అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్లు న్యాయం చేయాలని పెద్దమొత్తంలో అర్జీలు సమర్పించారు. కార్యక్ర మంలో మండల ప్రజా ప్రతినిధులు, నియోజ కవర్గ స్థాయి అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
శాశ్వత నీటి పరిష్కారం చూపాలి : సర్పంచ్
గండికోట గ్రామానికి శాశ్వత నీటి పరిష్కారం చూపాలని సర్పంచ్ కామాటి గురు ఈశ్వర్ కలెక్టర్ విజయరామరాజును కోరారు. శుక్రవారం మండల పరిషత్ సభా భవనంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కలెక్టర్‌కు సమస్యను విన్నవించారు. గండికోటకు పర్యాటకుల తాకిడి అధికంగా ఉండడం వల్ల సాగునీటికి అధికంగా సమస్య ఉందన్నారు. శ్మశాన వాటిక ఉన్నప్పటికీ వాటికి పట్టా లేకపోవడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు ఏర్పడే ప్రమాదముం,ని ఆ స్థలానికి పట్టాను మంజూరు చేయాలని తెలిపారు. జగనన్న కాలనీ లేఅవుట్లలో, ఇందిరమ్మ కాలనీల్లో సిసి రోడ్లను మంజూరు చేయాలని, గ్రామం మొత్తం విద్యుత్ స్తంభాలు పాడైపోయి ప్రమాదకరంగా ఉన్నాయని వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని విన్నవించారు. గూడెం చెరువు నుంచి గండికోటకు ఫోర్ లైన్ రోడ్డును, గూడెం చెరువు నుంచి దప్పెళ్ళలోని బోటింగ్ ప్రదేశం వరకు బీటీ రోడ్డును మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆనంద్, శ్రీను, గురు మోహన్, గురప్ప పాల్గొన్నారు.