ప్రజాశక్తి-మారేడుమిల్లి
బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ తొమ్మిది రోజుల నుండి రంపచోడవరం ఐటీడీఏ ముందు రిలే నిరాహార దీక్ష చేస్తున్న సత్య సాయిబాబా వాటర్ సప్లై వర్కర్లకు టిడిపి మారేడుమిల్లి మండల నాయకులు శుక్రవారం సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరాన్ని టిడిపి మండల అధ్యక్షులు గురుకు శేషు కుమార్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లాల రాజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా శేషు కుమార్ మాట్లాడుతూ 10 నెలల నుండి జీతాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా జీవిస్తాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వారికి రావాల్సిన జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే టిడిపి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మారేడిమిల్లి మండల ప్రధాన కార్యదర్శి పొడియం శ్రీను బాబు, కుట్రవాడ ఉపసర్పంచ్ పల్లాల భూపతిరెడ్డి, నాయకులు పండల జనార్దన్ రెడ్డి, మడకం వెంకటేష్, కత్తుల రత్నారెడ్డి, ఎ.రాజు, కుంజం ముత్తన్నదొర, సారపు నరసింహ దొర, మడి చిన్నాళ్ల దొర, అధిక సంఖ్యలో టిడిపి నాయకులు, సత్య సాయి బాబా వాటర్ కార్మికులు పాల్గొన్నారు.










