ప్రజాశక్తి-నందిగామ
నందిగామ మండలం అంబారుపేట లో గల కొలువై ఉన్న సత్యమ్మ అమ్మవారిని ఆదివారం తెలంగాణ మంత్రి పువ్వాడ అజరు దంపతులు దర్శించుకున్నారు.ఆలయ ఈవో సిబ్బంది , వైఎస్‌ఆర్సిపి నాయకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. సత్తెమ్మ తల్లి ఆలయంలో పువ్వాడ అజరు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన గెలుపు కోసం తన మిత్రుడు మొక్కుకున్న మొక్కును చెల్లించుకునేందుకు రావటం జరిగిందని మంత్రి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గ వైఎస్‌ఆర్సిపి నాయకులు మంత్రిని కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు పాలేటి సతీష్,వైసిపి నాయకులు చిరుమామిళ్ళ అశోక్, నాదెండ్ల నరేంద్ర, మాజీ జడ్పిటిసి వాసిరెడ్డి ప్రసాద్,మాజీ ప్రిన్సిపాల్ వాసిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










