ప్రజాశక్తి-అన్నవరం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని ఆదివారం కేంద్ర ఎరువులు రసాయనాల సహాయ మంత్రి భగవత్ క్యూబా దర్శించుకున్నారు. మంత్రికి దేవస్థానం ఇఒ ఎస్.ఆజాద్ ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సత్యదేవుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు వేద ఆశీస్సులు నిర్వహించారు. దేవస్థానం ఇఒ ఎస్.ఆజాద్ స్వామి జ్ఞాపికను, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం రిసెప్షన్ అధికారి పి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.










