ప్రజాశక్తి - అన్నవరం
అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలు ఈనెల 30 నుండి వారం రోజులపాటు జరిగే కళ్యాణ్ ఉత్సవాలకు వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఇఒ ఎస్ ఆజాద్ అధికారులకు సూచించారు. సోమవారం దేవ స్థానం అధికారులు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో తీసుకునేందుకు రత్నగిరిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా విచ్చేసే వేలాదిమంది యాత్రికులకు తగ్గట్టుగా, అన్నవరం కొండపై ట్రాఫిక్ అంత రాయం లేకుండా ప్రముఖుల వాహనాలు, దేవస్థానం బస్సులు, ఆటోలు తప్ప మిగిలిన ఏ వాహనమైన కొండ దిగువన పార్కింగ్ చేసేలా పోలీస్ శాఖ సహాయంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. కల్యాణం రోజున కళ్యాణ్ రోజున వేదిక వద్ద కల్యాణ మహౌత్సవాన్ని తిలకించేందుకు ప్రము ఖులతోపాటు పోటీ పడకుండా, అందరూ లైవ్ ద్వారా వీక్షించేందుకు ఎల్‌ఇడి స్క్రీన్లు వివిధ ప్రదేశాల వద్ద ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్య కూడళ్లలో ఆరోగ్య శిబిరాలు, రైల్వే స్టేషన్ వద్ద బస్ స్టేషన్ వద్ద టోల్గేట్ వద్ద బస్సులు ఎక్కే సమయాల్లో ఎటువంటి దొంగతనాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సహకారం, ఆయా ప్రదేశాలలో మెగా కెమెరాలతో పాటు బస్సుల్లో కూడా అప్రమత్తం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. మే ఒకటో తేదీన జరిగే సత్యదేవుని కల్యాణ వార్షికోత్సవం రోజున వీక్షించే భక్తులు అపరిమిత సంఖ్యలో వచ్చిన వారందరికీ స్వామి వారి ముత్యాల తలంబ్రాలతో పాటు ప్రసాదాన్ని తొడ తొక్కుడు లేకుండా ప్రతి భక్తునికి అందించే విధంగా వివిధ కౌంటర్ల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అదే విధంగా వారం రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో సాంస్కతిక కార్యక్రమాలు స్వామివారి ఊరేగింపు ఉత్సవాలు కొండ దిగువన నిర్వహించే క్రమంలో ఊరిలో నుంచి వెళ్లే భారీ వాహనాలన్నీ బైపాస్ మీదుగా మళ్లించే విధంగా చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. కొండపైన కొండ దిగువన ఆరోగ్య శిబిరాలతో పాటు 108 వాహనం, అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యంగా స్వామి ఊరేగింపు రోజుల్లో గ్రామంలో మద్యం దుకాణాలు ఎక్సైజ్ శాఖ సహకారంతో తెరవకుండా చర్యలు తీసుకుంటామన్నారు సమావేశంలో ఎసి రమేష్ బాబు దేవస్థానం పాలక మండల సభ్యులు, ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు, అన్నవరం ఎస్‌ఐ సోభన్ కుమార్ జిల్లాలోని వివిధ శాఖల అధికారులు దేవస్థానం అధికారులు పాల్గొన్నారు
రత్నగిరిపై వసతి, సేవలకు ఆన్‌లైన్ సౌకర్యం
అన్నవరం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఇక నుంచి వసతి గదులు, స్వామివారి సేవలకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం ఇఒ ఎస్.ఆజాద్ తెలిపారు. కొండపైన సత్యదేవుని బ్రహ్మౌత్సవాలు ఏర్పాట్లపై సోమవారం జిల్లాలోని వివిధ వివిధ శాఖలతో నిర్వహించిన సమీక్షా సమా వేశంలో ఇఒ ఆజాద్ ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన వివరాలు వెల్లడిం చారు. దేవస్థానంలో ఉన్న వసతి గదులలో 50 శాతం గదులు, స్వామి సేవలకు కూడా 50 శాతం రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు. షషష.aజ్‌ూవఎజూశ్రీవర.aజూ.స్త్రశీఙ.ఱఅ దేవస్థానం వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్ సేవలు రిజర్వు చేసుకునే విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని ఇఒ ఆజాద్ స్పష్టం చేశారు అయితే గతంలో కూడా పై అంశాలకు సంబంధించి వసతి గదులకు 15 శాతం ఆన్‌లైన్ రిజర్వ్ చేసు కోవచ్చు అని వెబ్ సైట్ ఇచ్చి బ్లాక్‌లో పెట్టడం , పెళ్లిళ్లు సీజన్లో వెబ్‌సైట్ తొలగించడం వంటి ఇబ్బందులు ఉండేవని ఆరోపణలు ఉన్నాయి.
సమీక్షా సమావేశంలో మాట్లడుతున్న ఇఒ ఆజాద్










