వనమహౌత్సవంలో మొక్కలు నాటుతున్న దేవస్థానం అధికారులు
ప్రజాశక్తి - అన్నవరం
అన్నవరం సత్యదేవుని మాన్యంలో దేవస్థాన అధికారులు వేల సంఖ్యలో మొక్కలు నాటి వనమహౌత్సవం నిర్వహించారు. గురువారం అన్నవరం జాతీయ రహదారి పక్కన సత్యదేవుని డిగ్రీ కళాశాల సమీపంలో భూముల్లో స్వామి నిత్య వైదిక పూజలకు అవసరమయ్యే మారేడు, జమ్మి, తులసి వంటి వివిధ రకాల సుమారు 500 మొక్కలు నాటించారు అదేవిధంగా త్వరలో 10 గ్రామాల్లో దేవస్థానం సంబంధించిన సుమారు 100 ఎకరాల భూముల్లో కూడా ఈ విధమైన మొక్కలు నాటించేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నామని ఇఒ ఆజాద్ స్పష్టం చేశారు










