
పుట్టపర్తి అర్బన్ : జగనన్నకు చెబుదాం - స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం చూపేలా అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు సూచించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో సోమవారం నాడు స్పందన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి 280 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం - స్పందన అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు సంతప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరించాలన్నారు. స్వీకరించిన అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్‌మెంట్ అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ టిఎస్.చేతన్, డిఆర్‌ఒ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, డీఆర్డీఏ పీడీ నరసయ్య, హౌసింగ్ పీడీ చంద్రమౌళిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.