May 24,2023 23:52

నివాళి అర్పిస్త్నున్న నాయకులు

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌
:కామ్రేడ్‌ సత్తిబాబు స్ఫూర్తితో పోరాడదామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్‌టిఆర్‌ స్టేడియంలో మున్సిపల్‌ కార్మికల సంఘం ఆద్వర్యంలో సత్తిబాబు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ, సత్తిబాబు 30 ఏళ్ళుగా నర్సీపట్నం మున్సిపాలిటీ, ముఠా, కాఫీ తదితర కార్మికుల సమస్యల పరిష్కారంకు నిరంతరం పని చేసారని కొనియాడారు. నమ్మిన సిద్దాంతం మేరకు కడవరకూ శ్రమించారని, మున్సిపల్‌ కార్మికల సమస్యల పరిష్కారం, నిత్యం కార్మికులకు అండగా నిలిచారన్నారు. కార్మికులు ఐక్యంగా సత్తిబాబు స్పూర్తితో పోరాడాలన్నారు. రానున్న కాలంలో మున్సిపల్‌ కార్మికుల సమస్యల పై రాష్ట్ర స్థాయి ఉద్యామానికి సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమలో సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు,మున్సిపల్‌ కార్మిక సంఘం నాయకులు కుపరాల రాజు, బోర్రా శ్రీనువాసరావు, యమగిరి రాజుబాబు, జి. కుమార్‌, తదితర్లు పాల్గొన్నారు.