May 07,2023 01:40
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో కేజీఎం హైస్కూల్‌ అధ్యాపకులు

ప్రజాశక్తి-చీరాల: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం విడుదలయ్యాయి. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా చీరాల కేజీఎం బాలికోన్నత పాఠశాల సత్తా చాటింది. పాఠ శాలకు చెందిన భావన 584 మార్కులు సొంతం చేసుకొని మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఈపురుపాలెం జడ్పీ బాలికల హైస్కూల్‌ 583 మార్కులతో రెండో స్థానంలో, 577 మార్కులతో ఏపీ మోడల్‌ మూడో స్థానంలో నిలిచాయి. కేజిఎం బాలిక ఉన్నత పాఠశాల అత్యధికంగా 71.43 శాతం పాస్‌ పర్సెంట్‌తో నిలవగా మిగిలిన పాఠశాలలో తర్వాత స్థానాలలో ఉన్నాయి. శనివారం సాయంత్రం తేజం బాలిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మొదట మూడు స్థానాలలో నిలిచిన భావన, హర్షిణి, జానకి విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు కృష్ణమోహన్‌, ఉపాధ్యాయులు జె చంద్రబాబు, వెంకటేశ్వరబాబు, ప్రభాకర్‌రావు అభినందించారు.