పూజితకు స్వీటు తినిపిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-మేదరమెట్ల: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మండలంలోని విద్యార్థులు ప్రతిభ చూపా రు. మేదరమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన కె పూజితశ్రీ 583 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. రావినూతల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన బి విజయలక్ష్మి 582 మార్కులతో మండలంలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. మేదరమెట్ల సెయింట్ ఆర్నాల్డ్స్ పాఠశాలకు సంబంధించి ఏ పల్లవి 580 మార్కులు సాధించి మూడో స్థానంలో ఉంది. మండలం మొత్తం మీద 485 మంది పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా 431 మంది ఉత్తీర్ణులైనట్లు ఎంఈఓ ఎల్ పున్నయ్య తెలిపారు.










