Dec 15,2022 23:30

మాట్లాడుతున్న వెంకటలక్ష్మి

ప్రజాశక్తి -కోటవురట్ల:పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్యను అందజేయాలని జిసిడిఓ వెంకటలక్ష్మి సూచించారు. మండలంలో కేజీబీవీ సహా పలు పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందజేస్తున్న మెనూ, వసతుల రికార్డులను పరిశీలించారు.విద్యార్థులతో ముచ్చటించి వారి నుండి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు.శతశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు చేపట్టాల న్నారు. ఆమెతో పాటు ఎఫ్‌ఏఓ రామచంద్ర శేఖర్‌ పాల్గొన్నారు.