Aug 17,2022 22:25

అవార్డు స్వీకరిస్తున్న ఈశ్వరరావు, నాగలక్ష్మి, సీత

ప్రజాశక్తి- సీతమ్మధార  ప్రముఖ హాస్య నటులు, కామెడీ క్లబ్‌ వ్యవస్థాపక కార్యదర్శి ఏమంది ఈశ్వరరావు నటించి, దర్శకత్వం వహించి, ఆశప్రియ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మించిన స్త్రీశక్తి లఘు చిత్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగు షార్ట్‌ ఫిలిం అసోసియేషన్‌ నిర్వహించిన లఘుచిత్రాల పోటీల్లో అవార్డు లభించింది. ఈనెల 14, 15 తేదీల్లో చుక్కపల్లి పిచ్చయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు, ఆర్‌పి పట్నాయక్‌, దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథం చేతుల మీదుగా ఈశ్వరరావు నిర్మాత నాగలక్ష్మి, పంతులవింత సీత అవార్డు అందుకున్నారు.
ఆశప్రియ క్రియేషన్స్‌ బ్యానర్లో ఇదివరకు నిర్మించిన షాడో లఘు చిత్రానికి అంతర్జాతీయ అవార్డు, ద ఆర్పిమెంట్‌, విలువలకు జాతీయ, రాష్ట్రస్థాయిలో మూడు అవార్డు లభించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ స్త్రీశక్తి లఘు చిత్రానికి అవార్డు రావడం సంతోషకరమని, ఈ చిత్రాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో సమాజానికి ఉపయోగపడే మరిన్ని లఘు చిత్రాలు నిర్మిస్తానన్నారు.