Jan 04,2023 23:49

నినాదాలు చేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు

ప్రజాశక్తి-అచ్చుతాపురం
మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు సావిత్రిబాయి పూలే దేశంలో మొదటిసారి కృషి చేశారని ఎపి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) జిల్లా అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి అన్నారు. యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి సబ్బారపు నూకరాజు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఎపి గురుకుల పాఠశాలలో భారతదేశ ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త సావిత్రిబాయిపూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీలక్ష్మి మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ పి.మధు, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎ.శేఖర్‌, ఉపాధ్యాయులు నాగమణి, దేవి, హేమలత, విద్యార్థులు పాల్గొన్నారు.