Aug 19,2023 20:41

మాట్లాడుతున్న డిఎస్‌పి రామచంద్ర

ప్రజాశక్తి-కందుకూరు :పట్టణంలోని శ్రీరామ్‌ నగర్‌ కాలనీలో కందుకూరు డిఎస్‌ఫి రామచంద్ర, కందుకూరు ఎస్‌ఐ శ్రీరామ్‌ నగర్‌ కాలనీ వాసులతో అవగాహన కల్పించారు.కందుకూరు డిఎస్‌పి రామచంద్ర కాలనీ వాసులనుద్ధేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తుండాలని సూచించారు. క్రమ శిక్షణతో పెంచాలని సూచించారు. బెల్ట్‌ షాప్‌ ల నిర్మూలన గురించి, పేకాట కోడిపందాల నియంత్రణ గురించి, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై అవగాహన కల్పించారు.