ప్రజాశక్తి-అద్దంకి: జీవిత బీమా సంస్థ నెల్లూరు డివిజన్ పరిధిలో జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో అద్దంకి శాఖకు చెందిన ఎల్‌ఐసి ఉద్యోగులు విజేతగా నిలిచారు. పురుషులు, మహిళ విభాగంలో పిజిఎల్ ఈశ్వర్, పి సాయివాణి విజేతలుగా నిలిచారు. వీరు ఆగస్టు 3,4 తేదీలలో విశాఖపట్నంలో జరుగు జోనల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని అద్దంకి బ్రాంచి మేనేజర్ వి మాధవకృష్ణ, సిబ్బంది, ఐసిఈయు నాయకులు టి సత్యనారాయణ బుధవారం అభినందించారు. ఈశ్వర్ ఎల్‌ఐసిలో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చెస్, రన్నింగ్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ పోటీలలో పాల్గొని విజేతగా నిలిచి ఎన్నో బహుమతులు అందుకున్నారు. ప్రకాశం జిల్లా నుండి ఏపీ ఎస్‌బిఏ కోచ్‌గా గుర్తింపు పొందారు. కందుకూరు ప్రాంతంలోని క్రీడాకారులకు ఈయన ప్రేరణగా నిలుస్తున్నారు. ఉచితంగా షటిల్ కోచింగ్ ఇస్తుంటారు.










