Mar 20,2023 00:01

అవార్డు అందుకుంటున్న సతీష్‌

ప్రజాశక్తి-మాడుగుల:మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి సీతా సతీష్‌ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన కవిత్వంలో రాణిస్తూ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడంతో తెలంగాణా రాష్ట్రం మంథనికి చెందిన శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సంస్థ ఆదివారం ఈయనకు ఉగాది నంది పురస్కారంతో పాటు, సాహితీ కిరణం బిరుదు ప్రదానం చేసి, పంచ లోహ కంకణం తొడిగి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన మహా కవి సమ్మేళనంలో సతీష్‌ అలల సవ్వడి అనే కవితను శ్రోతలకు వినిపించారు.సీతా సతీష్‌ కవిగా మరిన్ని అవార్డులు అందుకోవాలని సభలో పలువురు ఆకాంక్షించారు.