41వ వ్యవస్థాపక దినోత్సవంలోఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
నిర్వాసిత నిరుద్యోగుల నిరసన దీక్ష
ప్రజాశక్తి-ఉక్కునగరం: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని చేస్తున్న పోరాటానికి అందరి మద్దతు లభిస్తుందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అన్నారు. స్టీల్‌ప్లాంట్ 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉక్కనగరం కొవ్వొత్తుల జంక్షన్ వద్ద ఉక్కు మతువీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా కార్మికులంతా ఉక్కు పరిశ్రమను కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేశారు. అఖిలపక్ష పోరాట కమిటీ వేసి కార్యాచరణ రూపొందించి వచ్చే నెలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్తామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ అభివద్ధిని చూపించి, ప్రభుత్వ రంగంలో కొనసాగేలా ఢిిల్లీలోని అన్ని పార్టీలను కలిసి మద్దతు కోరనున్నామని తెలిపారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, నీరుకొండ రామచంద్రరావు, రామకష్ణ, కె ఎస్ ఎన్,మస్తానప్ప పాల్గొన్నారు.
నిర్వాసిత నిరుద్యోగులు నిరసన దీక్ష
32 త్యాగధనుల సమాధులపై నిర్మించిన స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టడం దుర్మార్గమని నిర్వాసిత నిరుద్యోగులు అన్నారు.స్టీల్ ప్లాంట్ 41 వ వ్యవస్థాపక సందర్భంగా ఉక్కునగరం కొవ్వొత్తుల జంక్షన్ వద్ద నిరసన దీక్ష చేశారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఎనిమిది వేల పైచిలుకు నిర్వాసితులకు న్యాయం చేయకుండా ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ప్రశ్నించారు. ప్రాణ త్యాగాలు చేసైనా స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని దీక్ష పూనారు. కార్యక్రమంలో ఉమ్మడి అప్పారావు, భాస్కరరావు, అధిక సంఖ్యలో నిర్వాసిత నిరుద్యోగులు పాల్గొన్నారు.










