Oct 26,2022 22:56

కౌశల్‌ పార్కులో మొక్కలు నాటుతున్న సిఎండి అతుల్‌భట్‌

ప్రజాశక్తి- విశాఖపట్నం : కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన స్వచ్ఛత 2.0 కార్యక్రమంలో భాగంగా లెర్నింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఎల్‌అండ్‌డిసి)లో కొత్తగా అభివృద్ధి చేసిన కౌశల్‌ పార్కును స్టీల్‌ప్లాంట్‌ ఎండీ అతుల్‌భట్‌ బుధవారం ప్రారంభించారు. పార్కులో మొక్కలు నాటారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలని కోరుతూ, కాంట్రాక్టు కార్మికులు, శిక్షణార్థులకు క్లాత్‌బ్యాగ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఎండి అతుల్‌భట్‌ మాట్లాడుతూ, వ్యర్థపదార్థాలను ఉపయోగించి, తుప్పలు నిండిన స్థలంలో అందమైన కౌశల్‌ పార్కును అభివృద్ధి చేసిన ఎల్‌అండ్‌డిసి బృందం సృజనాత్మకత, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణం పట్ల వారికున్న శ్రద్ధను అభినందించారు. అనంతరం స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను, అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం,సహాయ సెల్‌ను సందర్శించారు. కార్యక్రమంలో హెచ్‌ఆర్‌ జనరల్‌ మేనేజర్‌ జి.గాంధి, జనరల్‌ మేనేజర్‌( ట్రైనింగ్‌) ఎన్‌.భాను, జనరల్‌ మేనేజర్‌ (సిఎస్‌ఆర్‌) ఎ.అశోక్‌, ట్రైనీలు, విశాఖ ఉద్యోగులంతా స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు.