జిల్లా వార్తలు
విశాఖపట్నం
స్టీల్‌ప్లాంట్ త్రిఫ్ట్ సొసైటీ ఎన్నికల్లో మూడు ప్యానెల్స్ నామినేషన్ దాఖలు
నామినేషన్ దాఖలు చేస్తున్న సిఐటియు ప్యానెల్
ప్రజాశక్తి- ఉక్కునగరం : ఈ నెల 29న జరగనున్న స్టీల్‌ప్లాంట్ త్రిఫ్ట్ సొసైటీ ఎన్నికల్లో మూడు ప్రధాన యూనియన్ల తరపున నామినేషన్లు దాఖలయ్యాయి. సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసిలకు చెందిన మూడు ప్యానెల్స్ తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేసారు. గురవారం ఆయా యూనియన్లకు చెందిన కార్యాలయాల నుంచి బైక్‌ర్యాలీలతో తరలివచ్చి నామినేషన్లు వేశారు. ఐదేళ్ల కాలపరిమితో నిర్వహించనున్న త్రిఫ్ట్ సొసైటీ ఎన్నికలను స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ప్రధాన కార్మిక యూనియన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీ చేస్తున్నాయి.










