Sep 19,2023 23:45

గాజువాక సిపిఎం కార్యాలయంలో రాంబాబు తదితరులు

ప్రజాశక్తి-యంత్రాంగం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రక్షణకై సిపిఎం ఆధ్వర్యాన ఈ నెల 20వ తేదీన చేపట్టే ఉత్తరాంధ్ర జిల్లాల బైక్‌ యాత్రను, ఈ నెల 29న నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ పలుచోట్ల మంగళవారం పోస్టర్లను ఆవిష్కరించారు.
ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌లోని సిఒసిసిపి కార్యాలయంలో స్టీల్‌ అఖిలపక్షల కార్మిక సంఘాల ఆధ్వర్యాన సమావేశం నిర్వహించారు. ముందుగా బైక్‌ యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్టీల్‌ సిఐటియు ఉపాధ్యక్షులు టివికె.రాజు మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజా చైతన్యం కలిగించేందుకు ఈ బైక్‌ యాత్ర చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు జ్యోతిప్రసాద్‌, కనకరాజు, రమణాజి, భాస్కరరావు, రామారావు, కొమ్ము ప్రసాద్‌, సుబ్బారావు, జగన్‌, రామ్‌కుమార్‌, ఆర్‌.రాజబాబు, కొల్లి నాగేశ్వరావు నాయుడు, ఎస్‌కెకె.మొహిద్దిన్‌, పి.శ్రీనివాస్‌, హనుమంతరావు, పుల్లారావు, కె.ఆనంద్‌కుమార్‌, కన్నబాబు, బందోపాధ్యాయ పాల్గొన్నారు.
మధురవాడ : సిపిఎం మధురవాడ జోన్‌ కమిటీ ఆధ్వర్యాన కొమ్మాదిలోని సిఐటియు కార్యాలయం వద్ద పోస్టర్‌ను విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో జోన్‌ కార్యదర్శి డి.అప్పలరాజు, నాయకులు పి.రాజుకుమార్‌, డి.కొండమ్మ, టికె.శారద, బి.భారతి పాల్గొన్నారు.
గాజువాక : సిపిఎం గాజువాక జోన్‌ కమిటీ ఆధ్వర్యాన గాజువాక సిపిఎం కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్‌ కార్యదర్శి ఎం.రాంబాబు, నాయకులు లోకేష్‌, డి.రమణ పాల్గొన్నారు.
ఎస్‌ రాయవరం : ఉక్కు రక్షణ ఉత్తరాంధ్ర బైక్‌యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం మండల కన్వీనర్‌ ఎం. సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం వేమగిరిలో బైక్‌యాత్ర వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కుమారి, శాంతి, పెంటయ్య, లక్ష్మి, జయమ్మ, సూరిబాబు, రమణ పాల్గొన్నారు.
విశాఖ కలెక్టరేట్‌ : ఉక్కు రక్షణ బైకు యాత్ర పోస్టర్‌ను భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగ్‌ హోటల్‌ జంక్షన్‌ వద్ద యూనియన్‌ అధ్యక్షులు కె.నర్సింగరావు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.సుబ్బారావు, భవన నిర్మాణ కార్మికులు సింగనాయుడు, గణ, రామారావు, ఈశ్వరరావు పాల్గొన్నారు.
దేవరాపల్లి : ఉత్తరాంధ్ర బైక్‌ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన వాల్‌ పోస్టర్లను మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.వెంకన్న, వి.మాడుగుల మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల పోరాటానికి రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా విశాలమైన మద్దతు లభిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పి.బన్ను, సన్నిబాబు, సూర్యనారాయణ, దేముళ్ళు పాల్గొన్నారు.
రాంబిల్లి : మండల కేంద్రంలో ఉత్తరాంధ్ర బైక్‌ ర్యాలీ పోస్టర్‌ను సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి జి.దేముడునాయుడు మాట్లాడుతూ బైక్‌ యాత్ర ద్వారా బిజెపి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వల్ల రాష్ట్రానికి జరుగు నష్టం గురించి ప్రజలకు వివరించి వారిని చైతన్యం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్‌.శివాజీ, ఎం.శ్రీనివాసరావు, కార్మికులు ఎం.చిన్నా, అప్పారావు, రాము తదితరులు పాల్గొన్నారు.