గాజువాక డివిజన్ సిఐటియు మహాసభలోతీర్మానం
ప్రజాశక్తి -గాజువాక : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ చర్యలు వేగవంతమయ్యాయని, కార్మికులంతా సంఘటితమై వాటిని అడ్డుకుని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా ఒత్తిడి చేయాల్సిన అవసరం ంఉదని సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం అక్కిరెడ్డిపాలెంలో జరిగిన గాజువాక డివిజన్ సిఐటియు తొమ్మిదో మహాసభల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి మౌనంగా ఉండడాన్ని తప్పుబట్టారు.ప్రభుత్వరంగంలోనే పరిశమ్రలు ఉంటేనే కార్మికుల ప్రయోజనాలు పరిరక్షించబడతాయని, తద్వారా వారి కొనుగోలు శక్తిపెరుగుతుందన్నారు. గాజువాక ఆటోనగర్‌లోని పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల నిజవేతనాలు గణనీయంగా పడిపోయాయన్నారు. గాజువాకలో అనేక పరిశ్రమలున్నాయని, అయితే వాటిల్లో కనీస వేతనాలు అమలు కాకపోవడం వల్ల కార్మికుల ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగకపోవడంతో అప్పులు చేసి జీవనం సాగించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలకు అనుగుణంగా భవిష్యత్ పోరాటాలను చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జగ్గునాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను వివరించి, సిఐటియు ఆధ్వర్యాన భవిష్యత్ పోరాటాల ఆవశ్యకతను వివరించారు. ఇప్పటివరకు సిఐటియు చేసిన పోరాటాలను, విజయాలను గుర్తు చేశారు.
మహాసభలో తీర్మానాలు
మహాసభలో కనీస వేతనం అమలు చేయాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, స్టీల్‌ప్లాంట్ ప్రయివేటికరణ చర్యలు నిలుపుదల చేయాలని తీర్మానించారు. భవిష్యత్తులో కార్మికులంతా సంఘటితమై ప్రజా, కార్మిక సమస్యలపై ఐక్యపోరాటాలు చేయాలని నిర్ణయించారు.
సిఐటియు గాజువాక జోన్ కమిటీ నూతన కార్యవర్గం
సిఐటియు గాజువాక జోన్ 9వ మహాసభల్లో మూడేళ్ల తర్వాత యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా ఎం.రాంబాబు, అధ్యక్షులుగా డి.రమణ, కార్యదర్శిగా ఎ.లోకేష్, కోశాధికారిగా ఆర్.నాగేష్‌తోపాటు సభ్యులుగా బి. శ్రీను, జి. అప్పారావు, వై. చిన్నారావు, కె. తాతారావు, ఎస్. జగన్నాధరావు, ఎం. విజయరావు, కె. నాగేశ్వరరావు, ఎన్. రాజేంద్రప్రసాద్, కె. కిరీటం, శ్యామల, రాజులతో సహా 16మందిని ఎన్నుకున్నారు.










