ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేస్తామని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రకటించిన రోజు నుంచే ఇక్కడ ఆ పార్టీ పతనం ప్రారంభమైందని షిప్‌యార్డ్ ఐఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి పి.శ్రీరామ్మూర్తి ఆరోపించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా ఓడించేందుకు కారణం ఇదే అన్నారు. స్టీల్ ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు ఆదివారం నాటికి 715వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో షిప్‌యార్డ్ ఐఎన్ టియుసి నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని, స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దీక్షల్లో ఐఎన్‌టియుసి షిప్‌యార్డు ఉపాధ్యక్షుడు ఎ.ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
దీక్షలో కూర్చున్న షిప్‌యార్డు ఐఎన్‌టియుసి నాయకులు










