మాట్లాడుతున్న నిర్వాసితుల సంఘం నాయకులు
ప్రజాశక్తి -గాజువాక : స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని ఉక్కు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యాన పెదగంట్యాడ జంక్షన్‌లో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు పులి రమణారెడ్డి, మంత్రి శంకర్‌నారాయణ, ఏలేటి శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు నమ్మి రమణ, కణితి అప్పలరాజు మాట్లాడుతూ, ఆగస్టు 14, 15 తేదీల్లో 36 గంటలపాటు చేపట్టే సత్యాగ్రహ దీక్షకు జయప్రదం చేయడానికి పెదగంట్యాడ నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని కోరారు. ఉక్కు నిర్వాసితుల ఉపాధి అవకాశాలు, ఆర్.కార్డుదారులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జి.సత్యారావు పాల్గొన్నారు.










