ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ 69వ అఖిల భారత సహకార వారోత్సవాలను సొసైటీ ఉపాధ్యక్షులు కె.ఆనంద్‌కుమార్ ప్రారంభించారు. కార్యాలయం ఆవరణలో సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సహాకార రంగంలో పని చేస్తున్న సహకార వాదులు, సిబ్బంది, సంఘసభ్యులకు వారోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిధి సహాకార యూనియన్ లెక్చరర్ జి.సోమేశ్వరరావు మాట్లాడుతూ సహకార ఉద్యమాభివద్దికి దోహదపడే దిశగా భవిష్యత్ కార్యచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సహకార జెండా విశిష్టతను తెలియజేస్తూ సహాకార గీతం ఆలపించారు. కార్యక్రమంలో కార్యదర్శి డి. శ్రీరామచంద్రమూర్తి డైరక్టర్స్, కె.శ్రీనివాస్, లాలు భూక్య, మాజీ డైరక్టర్ వై.వైకుంఠరావు, కోపరేటివ్ సోర్స్ అధ్యక్షులు జగదీష్ డైరక్టర్ ఎ.వి.ఎస్.సత్యనారాయణ, సోసైటీ సీనియర్ మేనేజర్ క.దామోదర్ రెడ్డి, కోపరేటివ్ స్టోర్స్ బిజినెస్ మేనేజర్ బంగార్రాజు ,ఐ.అప్పారావు పాల్గొన్నారు. డైరక్టర్ ఎమ్.వి.రమణ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.










