Jul 28,2022 23:22

డిఎమ్‌కు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం కార్పొరేటర్‌ గంగారావు

ఆర్‌టిసి డిపో మేనేజర్‌కు కార్పొరేటర్‌ గంగారావు వినతి
ప్రజాశక్తి-ఉక్కునగరం :
స్టీల్‌ టౌన్‌ షిప్‌కు సిటీ బస్సుల సంఖ్యను పెంచాలని, కొత్త రూట్లకు బస్సులను ఏర్పాటు చేయాలని 78వవార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి. గంగారావు కోరారు. గురువారం స్టీల్‌సిటీ బస్‌ డిపో మేనేజర్‌కు కలిసి చర్చించారు. '38కె' బస్సుల సంఖ్య పెంచాలని, నిలిపేసిన '38టి' సర్వీసులను పునరుద్ధరించాలని, దువ్వాడ రైల్వేస్టేషన్‌కు బస్సు సదుపాయం కల్పించాలని కోరారు. స్టీల్‌ టౌన్‌షిప్‌ నుండి తగరపువలస వరకు బస్సులు నడపాలని, లేకుంటే 111 సర్వీసులను టౌన్‌షిప్‌ వరకు పొడిగించాలని కోరారు. గతంలో స్కూల్‌ పిల్లల కోసం గంట్యాడ, వడ్లపూడి, ఆగనంపూడి నుండి నడిపిన బస్సులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. కూర్మన్నపాలెం నుండి సెక్టార్‌-5కు బస్సు టికెట్‌ ధరను రూ.25 నుంచి రూ.15కు తగ్గించాలని కోరారు.దీనిపై డిపో మేనేజర్‌ సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారని గంగరావు తెలిపారు. కార్యక్రమంలో విసిసి స్టీల్‌జోన్‌ కన్వీనర్‌ సుశీల ఉన్నారు.