Mar 16,2023 22:29

స్టీల్‌ప్లాంట్‌ అధికారులను సత్కరిస్తున్న ఎస్‌సి, ఎస్‌టి అసోసియేషన్‌ ప్రతినిధులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : ఇటీవల సేఫ్టీ విభాగానికి సిజిఎంగా బాధ్యతలు స్వీకరించిన ఎంఎస్‌వి.కృష్ణయ్య, పిపిఎం అండ్‌ మైన్స్‌ సిజిఎం అజరు కుమార్‌ షోబ్ది, ఇఎస్‌ అండ్‌ ఎఫ్‌ డికె బాధ్యతలు తీసుకున్న దుర్గాప్రసాద్‌ను ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిని సన్మానించారు. సంబంధిత విభాగంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. బాధ్యతలు స్వీకరించిన అధికారులు మాట్లాడుతూ, తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు బోండా తౌడన్న, ప్రధాన కార్యదర్శి బయ్యే మల్లయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.సత్యనారాయణ, కోశాధికారి కెవి.రత్నం, దాసరి పుల్లారావు, మోహన్‌బాబు, పైడి కొండలరావు, చింతా మోహన్‌, కొప్పుల పరంధామయ్య తదితరులు పాల్గొన్నారు.