Dec 10,2022 23:43

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న వైఎస్‌ ఎంపిపి, బ్యాంకు చీప్‌ మేనేజర్‌

ప్రజాశక్తి -హుకుంపేట:స్టేట్‌ బ్యాంక్‌ ఫ్రీ అకౌంట్‌లను ప్రజలు సద్వినియొగం చేసుకోవాలని వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు సూచించారు. స్థానిక గిరిజన సంఘం కార్యయంలో వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, స్టేట్‌ బ్యాంక్‌ చీప్‌ మేనేజర్‌ శ్రీధర్‌ బాబు తో కలిసి ఉచిత స్టేట్‌ బ్యాంక్‌ జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌లకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అకౌంట్‌లు లేనివారు స్టేట్‌ బ్యాంక్‌ ప్రీ జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఈ అవకాశం సోమవారం వరకు మాత్రమే ఉందన్నారు. అకౌంట్‌ చేయడానికి ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, రఖాఖాస్తు ఫారం, ఆధార్‌ కార్డ్‌, రెండు పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు ఉంటే సరిపోతుందని, ఒకే గ్రామంలో 10 మంది ఉంటే ఆ గ్రామానికే వచ్చి అకౌంట్‌ ఓపెన్‌ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ శ్రీధర్‌ బాబు, అకౌంట్‌ అసిస్టెంట్‌ సూర్యం పాల్గొన్నారు.