Feb 26,2023 00:17
స్టడీ మెటీరియల్‌ను ఇస్తున్న మహాలక్ష్మినాయుడు

ప్రజాశక్తి -రావికమతం: మండలంలోని పలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 17 మంది దివ్యాంగ విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌, బస్సు పాసులను మేడివాడ జిల్లా పరిషత్‌ పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయుడు మహాలక్ష్మినాయుడు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఉపాధ్యాయుడు మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ, చిన్నపాచిల, గర్నికం కేజీబీవీ, దొండపూడి, కొత్తకోట, జెడ్‌.కొత్తపట్నం తదితర జడ్పీ హైస్కూల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా అందజేశామన్నారు. పాఠశాలకు రాని వారి ఇంటికి వెళ్లి స్టడీ మెటీరియల్‌, బస్సు పాసులను అందించామని తెలిపారు.