Aug 13,2022 23:06

విజేతలతో ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- సీతమ్మధార, పిఎం.పాలెం
జాతీయ స్థాయి ఓపెన్‌ టు ఆల్‌ స్టైల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతలకు భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభినందించారు. ఈ నెల 7వ తేదీన తెలంగాణ రాష్ట్రం నాగర్‌ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగిన మొదట జాతీయ స్థాయి ఓపెన్‌ టు ఆల్‌ స్టైల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతలకు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో పతకాలు బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీలలో రాణించి విశాఖకు మంచిపేరు తేవాలన్నారు. మాస్టర్‌ టి.సాయికుమార్‌ ఆధ్వర్యాన నడుస్తున్న వింగ్స్‌ షోటాకాన్‌ అకాడమీ మధురవాడ డివిజన్‌కు చెందిన విద్యార్థులు ఈ ఛాంపియన్‌ షిప్‌ పోటీలలో వివిధ పతకాలు సాధించారు. వీరిలో పోతిన ప్రణీత్‌ కుమిటె విభాగంలో బంగారు, కట విభాగంలో వెండి పతకం సాధించగా, పోతిన ధీరజ్‌ కుమిటె, కట విభాగాలలో కాంస్య, రజత పతకాలు సాధించారు. ఎం గణేష్‌ కుమిటెలో సిల్వర్‌, ధర్మ, భానుప్రకాష్‌, విశ్వతేజలు టీం కటలో బంగారు పతకాలు సాధించారని మాస్టర్‌ సాయికుమార్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనూష కేటరింగ్‌ అధినేత 6వ వార్డు వైసిపి నాయుకులు పోతిన ప్రసాద్‌, ఎ.జయప్రద, బుడుమురి మీన, కిల్లనా పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.