కడప ప్రతినిధి : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రీజినల్ కార్యాలయం స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయడంలో నిబంధనల్ని అమలు చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రభుత్వం తాజాగా 313 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌డి కార్యాలయం స్టాఫ్‌నర్స్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి వారం రోజులు ముందుగా పోస్టుల భర్తీ ప్రకటన విడుదల చేయడం మొదలుకుని ఖాళీల వివరాలతో కూడిన ప్రకటనను విడుదల చేయాల్సి ఉంది. అనంతరం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయాల్సి ఉంటుంది. చివరగా మెరిట్ మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇటువంటి నిబంధనల్ని వైద్య ఆరోగ్య శాఖ రీజినల్ కార్యాలయం విస్మరించిందనే ఆరోపణలు ముప్పిరిగొనడం విస్మయాన్ని కలిగిస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రీజియన్ పరిధిలో స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. ఈ నెల 21, 22వ తేదీల్లో 313 స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ సందర్భంగా 11,120 దరఖాస్తులు చేసుకున్న సంగతి సంగతి తెలిసిందే. 291 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. తాజా స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీ చేయనున్న సందర్భంగా అప్పటి దరఖాస్తుల్లో మెరిట్స్ ఆధారంగా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ సందర్భంగా పదుల సంఖ్యలో బోగస్ సర్టిఫికెట్స్ వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజా స్టాఫ్‌నర్స్ పోస్టుల రిక్రూట్‌మెంట్ సందర్భంగా పదుల సంఖ్యలో ఉన్న దరఖాస్తుదారుల సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉరుముతోంది. స్టాఫ్‌నర్స్ పోస్టుల రిక్రూట్‌మెంట్ ప్రకటన అంశాన్ని వారం రోజులు ముందుగా విడుదల చేయాల్సి ఉన్నట్లు సమాచారం. ఇటువంటి నిబంధనల ఆధారంగా ఆర్‌డి కార్యాలయం పరిధిలోని ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన వేలాది మంది నిరుద్యోగులు కౌన్సెలింగ్ ఉందనే విషయం తెలిసే అవకాశం ఉండేది. అర్హులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉండేది. కౌన్సెలింగ్ సమాచారం తెలుసుకున్న నిరుద్యోగులు సకాలంలో కౌన్సిలింగ్‌కు చేరుకునేందుకు అవకాశం ఉండేదనే వాదన వినిపిస్తోంది. కౌన్సెలింగ్‌కు 24 గంటల ముందు ఖాళీల ప్రకటన జాబితాను విడుదల చేయాలి. దరఖాస్తుదారులు తమకు గల ఉద్యోగ అవకాశాలను పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. ఇటు వంటి నిబంధనల్ని గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా రిక్రూట్‌మెంట్ చేయడంపై ఉద్యోగ సంఘాలు, ఉద్యోగార్ధుల నుంచి విమర్శల వర్షం కురుస్తోంది.










