ప్రజాశక్తి- బాపట్ల : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచ ేస్తున్న స్టాఫ్ నర్సుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఎస్. విజయమ్మకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో అనేక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో నైట్ వాచ్‌మెన్ లేకపోవడంతో నర్సులు రాత్రి వేళల్లో పిహెచ్‌సిల్లో విధులు నిర్వహిం చేందుకు భయపడుతున్నారు. అయినప్పటికీ నైట్ డ్యూటీలు చేయాల్సిందేనని వైద్యాధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దుద్దుకూరు పిహెచ్‌సికి ప్రహరీ లేదని తెలిపారు. పిచ్చి చెట్లు పెరిగిపోయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో పాములు సంచరి స్తున్నాయని తెలిపారు. దుద్దుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రహరీ నిర్మాణంలో గ్రామపంచాయతీతో సంప్రదించి సమస్య పరిష్కారానికి కషి చేస్తామని జిల్లా వైద్యాధికారి హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు చింతా శేషు బాబు, ప్రభుత్వ నర్సుల అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి మంజేష్, ప్రధాన కార్యదర్శి ఎం. ఉదయ లక్ష్మీ, ఉపాధ్యక్షులు ఎం. వందనా దేవి , విజరు కుమార్ , ఎం మహేష్ , షేక్ జానీ భాష , రమణా నాయక్, జానీ భాష, హాజన్ నాయక్ పాల్గొన్నారు










