Sep 07,2023 20:27

వైద్య ఆరోగ్య శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయం

 కడప ప్రతినిధి స్టాఫ్‌నర్స్‌ పోస్టుల కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల తొమ్మిదిన కౌన్సెలింగ్‌ నిర్వహ ణకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఏర్పాట్లు పూర్తి చేసింది. జోన్‌-4 పరిధిలోని ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల పరిధిలో 36 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులతో కూడిన కౌన్సెలింగ్‌ జాబితాను రూపొందించింది. ప్రభుత్వం 2022 ఆగస్టులో 300 మంది స్టాఫ్‌నర్స్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆర్‌డి కార్యాలయ యంత్రాంగం కౌన్సెలింగ్‌ నిర్వహించింది. ప్రభుత్వం రెండు నెల కిందట అదనంగా మరో 313 మంది స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ ప్రకటన విడుదల చేసింది. కడపలోని ఓ కల్యాణ మండపంలో ఆర్‌డి కార్యాలయం కౌన్సెలింగ్‌ నిర్వహించింది. ఇందులోని నాన ్‌జాయినింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ నిబంధనల ప్రకారం ఏడాది వ్యవధిలోపు ప్రకటిత పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ నిర్వహిం చాల్సి ఉన్నట్లు సమాచారం. ఆర్‌డి కార్యాలయం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రిక్రూట్‌మెంట్‌ నిబం ధనల్ని బేఖాతర్‌ చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 31తో నోటి ఫికేషన్‌ కాలపరిమితి ముగిసిపోయింది. నోటిఫికేషన్‌ నిబంధనల్ని బేఖాతర్‌ చేస్తూ కాలపరిమితి ముగిసినప్పటికీ స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు కౌన్సెలింగ్‌ నిర్వహించడంలోని ఆంతర్యం ఏమిటో తెలియడం లేదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా కలెక్టర్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నోటిఫికేషన్‌ నిబంధనల్ని పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.