Sep 21,2023 23:53

స్టాంపులు కోసం పడిగాపులు

స్టాంపులు కోసం పడిగాపులు
 గంటల తరబడి
ఎదురుచూస్తున్న బాధితులు
పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న
కార్యాలయ సిబ్బంది
ఇదీ సబ్‌రిజిస్టర్‌
కార్యాలయం పరిస్థితి

ప్రజాశక్తి -తొట్టంబేడు: ఇక్కడ దళారులకు ఎక్కువ ప్రాధాన్యత.. స్టాంపులు కొనడానికి కూడా లంచం ఇవ్వాల్సిందే.. కమిషన్‌ లేనిదే ఈ కార్యాలయంలో ఏ పని జరగదట.. సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో స్టాంపులు తీసుకుంటే రూ.50లది 50 రూపాయలే కడుతారు. వంద రూపాయలు స్టాంపు తీసుకుంటే వంద రూపాయలు మాత్రమే కడతారు.. అయితే ఈ విధంగా రైతులకు.. రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వచ్చిన బాధితులకు స్టాంపులు ఇస్తే వాళ్లకి ఏమీ ఆదాయం రాదని పక్కనే ఉన్న దళారుల దగ్గర స్టాంపులు తీసుకోవాలని చెబుతున్నారు. రిజిస్టర్‌ కార్యాలయంలో స్టాంపులు దొరకవు దళారుల దగ్గరే దొరకడం ఇక్కడ విశేషం.. ఎంతసేపు ఎదురుచూస్తూ.. పడి కాపులు కాసిన ఒకే ఒక్క స్టాంపు పత్రం కూడా ఇవ్వరు. ఇదేంటి అనీ ప్రశ్నిస్తే వాళ్లను బెదిరించి కార్యాలయం నుంచి తరిమేస్తారు. కొంతమంది రైతులు కార్యాలయం ఎదుటే బహిరంగంగా గొడవలకు దిగుతారు సబ్‌రిజిస్టర్‌ గాని, సిబ్బంది కానీ ఇంత జరుగుతున్న కార్యాలయ సిబ్బంది మాత్రం మాకెందుకులే అంటూ వ్యవహరిస్తుంటారు. ఇక్కడ కాసులు ఇస్తే ఏ పనైనా చేసేస్తారు. ముడుపులు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్‌ చేయకుండా సాకులు చెబుతారట.. ఎంతటి సమస్య ఉన్నా ముడుపులు అందిస్తే చాలు రిజిస్ట్రేషన్‌ చేసి డాక్యుమెంట్‌ చేతిలో పెడతారని బహిరంగంగా పలువురు చర్చించుకుంటున్నారు. ఇది ఎక్కడో కాదండోరు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం సబ్‌రిజిస్టర్‌ కార్యాలయంలోనీ పరిస్థితి ఇది...
తొట్టంబేడు మండల కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న ధర్మరాజుల స్వామి గుడి వెనుక ఉన్న తొట్టంబేడు జాయింట్‌ సబ్‌ రిజిస్టర్‌ వారి కార్యాలయంలో స్టాంపులు కోసం, రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వచ్చిన బాధితులు గురువారం గంటల తరబడి నిలబడిన కూడా సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.. ఉదయం 10 నుంచి 12:30 గంటలకు కూడా రిజిస్టర్‌ ఆఫీస్‌కి వచ్చిన బాధ్యతలకు అధికారులు సమాధానం చెప్పలేదని వాపోయారు. బాధితులు స్టాంపులు అడుగుతుంటే రిజిస్టర్‌ ఆఫీస్‌లో పనిచేసే సిబ్బంది ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ముఖం సాటేస్తున్నారు. పక్కనే ఉన్న దళారుల వద్ద వెళ్లి స్టాంపులు తీసుకోవాలని వారే బహిరంగ చెబుతున్నారు. దళారులు చేత కార్యాలయ సిబ్బంది స్టాంపులు అమ్మి ఇస్తున్నారని కార్యాలయ బయట గుసగుసలు వినిపిస్తున్నాయి. కమిషన్లకు అలవాటపడి ఇలా చేయిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తు కార్యాలయ సిబ్బంది పనితీరుపై పట్టించుకునే నాధుడే లేడా అని రిజిస్ట్రేషన్‌ కు వచ్చిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తొట్టంబేడు సబ్‌ రిజిస్టర్‌ ను వివరణ కోరగా..
కార్యాలయంలో స్టాంపులు లేవు లేకపోతే ఎలా ఇవ్వగలుగుతాం అని అన్నారు. రైతులు అడుగుతున్నా కూడా ఎక్కడినుంచి తెచ్చి ఇవ్వగలము అని ఆయన వివరణ ఇచ్చారు ..అయితే అదే సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో మధ్యాహ్నం ఒకటిన్నరకు స్టాంపులు ఇవ్వడం గమనార్హం.