May 18,2023 20:07

నిల్వలు పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పౌర సరఫరాల గోడౌన్‌ పాయింట్‌ను గురువారం ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ తనిఖీ చేశారు. గోడౌన్‌లో ఉన్న రేషన్‌ నిల్వ, రికార్డులు, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బియ్యం కార్డుదారులకు పంపిణీ చేసే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లూ జరగకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. తహశీల్దార్‌ వెంకట లక్ష్మీ, పౌర సరఫరాల ఉప తహశీల్దార్‌ వలి బాషా ఉన్నారు.