Dec 26,2022 23:49

ఘంటసాల చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎంపీ తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి
హైదరాబాద్‌ వాసి చల్లా సుబ్బారాయుడు రచించిన 'శతాబ్ది గాయకుడు ఘంటసాల' పుస్తకాన్ని ఘంటసాల శతజయంతి వేడుకల్లో భాగంగా సిద్ధార్థ సోషల్‌ సర్వీస్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద సమావేశ మందిరంలో సోమవారం ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక ఎంపీ డాక్టర్‌ బివి.సత్యవతి ఘంటసాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా స్థాయి పాటల పోటీలు, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎంపీ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. జడ్జిలుగా తేజేశ్వరి, విశ్వనాథం, ఆనందరావు, పండూరి సత్యనారాయణ వ్యవహరించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు విష్ణుమూర్తి, కదిరి రాము, బిఎ స్వామి, అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు బల్ల నాగభూషణం, విన్నకోట నీలేష్‌ గుప్తా, బల్ల శ్రీనివాసరావు, అల్లాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.