ప్రజాశక్తి - కాకినాడ రూరల్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ సత్ సంకల్పంతో చేసిన కృషి వల్ల వాలంటరీ వ్యవస్థ విజయం సాధించిందని కాకినాడ రూరల్ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు తెలిపారు. బుధవారం స్థానిక ఇంద్రపాలెం పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ కల్యాణ మండపంలో ఇంద్రపాలెం పంచాయతీ ఎఒ బి.సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గోపిశెట్టి పద్మజా బాబ్జి అధ్యక్షతన వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వాలంటీర్లు వేకాడి దుర్గాబాబు, కొండేటి ఉషకు సేవా వజ్ర, కోడి నాగబాబు, కొర్లపు ఆనందబాబు, శీలం దుర్గాదేవి, గుత్తుల పద్మ, షేక్ హసీనా, కొప్పిశెట్టి వీరబాబు, కోటగిరి ప్రేమకుమారి, పెదపూడి జగదీష్, ర్యాలీ కనకదుర్గలకు సేవ రత్న అవార్డులతో ఎంఎల్‌ఎ కన్నబాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు సత్కరించారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎంఎసి చైర్మన్ గీసారు శీను, వైసిపి నాయకులు కొప్పిశెట్టి గణేషు, నక్కా కాపు, పంపన రామకృష్ణ, గీసాల శ్రీనివాసరావు (గంగానపల్లి) మాధవ్, ఎం.రాఘవులు, పలివేల శ్రీనివాసు, అరుణ ఎంపిటిసిలు చవ్వాకుల గజలక్ష్మి, వాసంశెట్టి సత్యవేణి, మామిడాల నాగభూషణం, కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు . పెదపూడి మండలంలోని కైకవోలు, కుమారప్రియం. పెద్దాడ గ్రామాల సర్పంచులు నూని పట్టాభిరామన్న చౌదరి, డొకుబుర్ర మీనాక్షి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సేవారత్న, సేవా మిత్ర గ్రామ వాలం టీర్లను ఘనంగా ఎంపిపి కేతా తులసి ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. కార్యక్ర మంలో జడ్‌పిటిసి పేప కాయల వెంకటలక్ష్మి, ఇన్చార్జి ఎంపిడిఒ కర్రి హరికష్ణ సత్యరెడ్డి, ఉప సర్పంచి కొప్పిశెట్టి వీరశంకర్(పండు), కుమారప్రియం గ్రామా భివద్ధి కమిటీ చైర్మన్ పెమ్మనబోయిన సత్తిబాబు, ఎంపిటిసి యాళ్ల మాధవి, పార్లమెంటు నియోజకవర్గం బిసి సెల్ కన్వీనర్ కేతా శ్రీను, సచివాలయం కార్యదర్శులు ఎం.త్రినాధ్. చిన్ని పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్ మండలం మల్లిశాలలో ఎంపిపి అత్తులూరి నాగబాబు అధ్య క్షతన బుధవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసిపి రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురాం పాల్గొని గ్రామంలో ఉన్న 28 మంది వాలంటీర్లను సేవా మిత్రలుగా గుర్తించి శాలువాతో సన్మానించి, ప్రశంసాపత్రాలు, బ్యాడ్జీలు అందజేశారు. వీరికి బ్యాంక్ ఖాతాలో ఒక్కరికి రూ.10వేలు ప్రోత్సాహక నగదు బహుమతి అందించనున్నారు. కార్యక్ర మంలో ఎంపిటిసి అత్తులూరి నాగరత్నం, అత్తులూరి శ్రీను, సచివాలయ సిబ్బంది, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గండేపల్లి మండలం ఎర్రం పాలెం గ్రామంలో వాలంటీర్లను గ్రామ వైసిపి నాయకులు నిమ్మలపూడి శ్రీహరి ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇంద్రపాలెంలో సత్కరించిన వాలంటీర్లతో ఎంఎల్‌ఎ కన్నబాబు, ప్రజాప్రతినిధులు










