విద్యార్థులను ప్రశ్నిస్తున్న ఉప విద్యాశాఖ అధికారి
ప్రజాశక్తి-నక్కపల్లి: పదో తరగతి విద్యార్థులు మంచి మార్కులతో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని యలమంచిలి ఉప విద్యా శాఖాధికారి యన్. ప్రేమకుమార్ సూచించారు. పదో తరగతి విద్యార్థులకు జిల్లా విద్యా శాఖ రూపొందించిన 50 రోజుల సంసిద్ధత కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన నక్కపల్లి బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. ప్రత్యేక తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువును అభ్యసించాలన్నారు. సబ్జెక్టుల వారీగా సందేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృతి చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందాలన్నారు.










