Nov 10,2023 21:33

విద్యార్థులతో చదివిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు

ప్రజాశక్తి - పాచిపెంట :  రానున్న పదో తరగతి పరీక్షల్లో అందరూ కష్టపడి శత శాతం ఫలితాలు సాధించాలని జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు అన్నారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ముఖ్యంగా మోడల్‌ పేపర్‌ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కొంతమంది విద్యార్థులతో పాఠాలు చదివించారు. ఇష్టపడి చదివితే ఏదీ కష్టం కాదని హితవు పలికారు. సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేకత తర్ఫీదు ఇవ్వాలని బాధించకుండా బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ రాజశేఖర్‌ ఎంపిడిఒ లక్ష్మీకాంత్‌, ఎంఇఒ పి.జోగారావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.