అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారి
ప్రజాశక్తి -నక్కపల్లి :అపరాలను సాగు చేసే రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయశాఖాధికారి ఉమాప్రసాద్ సూచించారు. మండలంలోని శుక్రవారం కాగిత, చినదొడ్డిగల్లు గ్రామాల్లో అపరాల సాగుపై క్షేత్ర పర్యటన చేశారు. మినుము, పెసర పంటల్లో పురుగు సోకినట్టు గుర్తించారు. నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం వరి నూర్పు ప్రక్రియను పరిశీలించారు.










