ప్రజాశక్తి - దేవనకొండ
పత్తి పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. శుక్రవారం దేవనకొండ శివారులో రైతు బోయ శేఖర్ పొలంలో ఎఒ సురేష్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్, సిసిహెచ్ 369 కంపెనీ నిర్వహించిన పత్తి పంట క్షేత్ర ప్రదర్శనను పరిశీలించారు. పత్తి సాగు, యాజమాన్య పద్ధతుల వివరాలను రైతు శేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. క్రిస్టల్ రీజినల్ మేనేజర్ వై.రఘునాథరెడ్డిని పంట దిగుబడి, కాల పరిమితి గురించి అడిగి తెలుసుకున్నారు. తక్కువ సమయంలో పత్తి పంట దిగుబడి ఆశాజనకంగా వస్తుందని క్రిస్టల్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ క్షేత్ర ప్రదర్శనను చూసేందుకు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఎఇఒ యోగేంద్ర బాబు, రంగన్న, విఎఎ రంగన్న, క్రిస్టల్ సేల్స్ మేనేజర్ వీర బ్రహ్మయ్య, వెంకట సాయి ట్రేడర్స్ సదాశివరావు, వేణుగోపాల్‌రావు, హనుమాన్ ఫర్టిలైజర్స్ సిలివేరి శ్రీరాములు పాల్గొన్నారు.
పత్తి పంట ఈ-క్రాప్ నమోదును పరిశీలిస్తున్న వరలక్ష్మి










