Feb 27,2023 23:01

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: సస్పెన్స్‌, థ్రిల్లర్స్‌తో పాటు యాశ్రీన్‌ సీక్వెన్స్‌తో గ్రంథాలయం సినిమా ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుందని చిత్ర దర్శకుడు జంపాన సాయి శివన్‌ తెలిపారు. గ్రంథాలయం చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సోమవారం సాయంత్రం నగరంలోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న గ్రంథాలయం చిత్రం మార్చి 3వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌ కానుందని తెలిపారు. గ్రంథాలయం చిత్రం పూర్తి స్థాయి థ్రిల్లర్‌ సస్పెన్స్‌తో కూడుకున్న చిత్రమని తెలిపారు. ఈచిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలిపారు. ప్రతి సన్నివేశాన్ని చక్కగా తీశామని గ్రంథాలయంలో జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఉఠ్కంటకు గురిచేస్తాయన్నారు. హీరో విన్ను మద్దిపాటి మాట్లాడుతూ గ్రంథాలయం సినిమా టీజర్‌కు ప్రేక్షకుల వద్ద నుండి మంచి స్పందన వస్తుందన్నారు. దర్శకుడు ప్రతి అంశాన్ని చక్కటి నైపుణ్యతతో తీశారని తెలిపారు. హీరోయిన స్మిరిత రాణి మట్లాడుతూ తెలుగులో తన మొదటి చిత్రం గ్రంథాఇలయం అని ఈచిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత అయ్యప్ప పాల్గొన్నారు.