Dec 23,2022 22:45

నిలిచిపోయిన వాహనాలు.

శృతిమించుతున్న మట్టిమాఫియా
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో మట్టిమాఫియా ఆగడాలు శృతిమించుతున్నాయని నెన్నూరు గ్రామస్తులు శుక్రవారం టిప్పర్లను అడ్డుకున్నారు. టిప్పర్‌ ఓ మహిళను ఢకొీనడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టిప్పర్‌ ఆపకుండా డ్రైవర్‌ వెళ్లిపోవడంతో రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి నిరసన తెలిపారు. రెండేళ్లుగా టిప్పర్ల వల్ల నానా ఇబ్బందులు పడుతున్నామని, పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకమార్లు టిప్పర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు వచ్చి గ్రామస్తులకు నచ్చజెబుతున్నారే తప్ప, టిప్పర్లను ఆపలేకపోతున్నారన్నారు. వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు గుట్టలు, కొండలను గుల్ల చేస్తున్నాయన్నారు. గ్రామస్తులకు, పోలీసులకు మధ్య మాటామాటాపెరిగి స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇకపై టిప్పర్లు రాకుండా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు