కడప అర్బన్ : విద్యార్థులలో జీవితాలలో తీపి గుర్తులు మిగిల్చి కోవటానికి, సజనాత్మకతను వెలికి తీయ టానికి కల్చరల్ ఆక్టివిటీస్‌లో ప్రావీణ్యతను చాటు కోవటానికి కడప బాలోత్సవం జిల్లాలో ఏర్పాటు చేశామని కన్వినింగ్ కమిటీ సభ్యులు బి. లక్ష్మి రాజా, బి. రాజశేఖర్ రాహుల్ తెలిపారు. కడప బాలోత్సవం ద్వారా నిరంతరం విద్యార్థులకు మనసులను ఉత్తేజప రచడానికి ఆహ్లాదం నింపటానికి కడప బాలోత్సవం పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా చిత్రలేఖనం పోటీలు శనివారం ఎస్‌వి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ చిత్రలేఖనం పోటీలకు జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. చిత్రలేఖనం పోటీలలో పలు ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలల నుంచి 878 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ చిత్రలే ఖనం పోటీలలో 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు భాగస్వాములయ్యారని చెప్పారు. విజేతలకు ఎస్‌వి ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 14న బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. విజేతలకు మెసేజ్ ద్వారా, ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. ఈ చిత్రలేఖన పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రభుత్వ, ప్రయివేట్ పాఠ శాల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి, సభ్యులు ప్రిన్సిపల్ వీర సుధాకర్ రెడ్డి, బి.గోపాల్, నాగ మునిరెడ్డి, బాల ఎల్లారెడ్డి, మత్యుం జయ శర్మ, కె. సురేష్ బాబు, ఎల్‌ఐసి రఘునాథరెడ్డి, కరీం, సునీత, అపర్ణ, ఉషా, తులసి, పాలెం మహేష్ బాబు, రవికుమార్, వెంకటేశ్వర్లు, శివరాం పాల్గొ న్నారు. కలసపాడు : మండలంలోని స్థానిక సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత బాలల దినోత్సవ సందర్భంగా ముందస్తు ఆటల పోటీలను నిర్వహి ంచారు. సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ చిత్తా ప్రభావతి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో కూడా ప్రావీణ్యంను సాధించి తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.