ప్రజాశక్తి - కాకినాడ
విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వేసవి వినోదం సహకరిస్తుందని రోటరీ క్లబ్, ప్రాధమిక విద్య, అక్షరాస్యత కమిటీ ఛైర్మన్ పి.వి.సుబ్బారావు అన్నారు. జగన్నాధపురం ఎంఎస్‌ఎన్ చారిటిస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో విబివిఆర్ ఛారిటబుల్ ఫౌండేషన్ అధ్యర్యంలో ఐదో రోజు వేసవి వినోదం శనివారం నిర్వహించారు. విద్యార్థులకు ఓరిగమి పై శిక్షణను ఇవ్వడం జరిగింది. రిసోర్స్ పర్సన్స్‌గా పి.విజయలక్ష్మి, జి.శ్యామలా కుమారి వ్యవహరించారు. పిల్లలతో కాగితాలతో బొమ్మలు చేయించారు. ఓరిగమి వలన వధాగా ఉన్న కాగితాలతో బొమ్మలు చేయడం వలన పర్యావరణ పరి రక్షణకు అవకాశం ఉంటుందన్నారు. బాలవేదిక కన్వీనర్ నోరి బలరామకృష్ణ పాటలు పాడటం నేర్పించారు. పెద్దాపురం స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహి స్తున్న వేసవి విజ్ఞాన శిబిరం లో శనివారం రిటైర్డ్ హెడ్మాస్టర్ మహమ్మద్ అబ్దుల్ హక్ బాలలతో పుస్తకపఠనం చేయించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి పాలంకి నాగరాజు, సిబ్బంది బుల్లయ్య, మరియమ్మ, పాఠకులు పాల్గొన్నారు.
ఎంఎస్‌ఎన్‌లో కాగితం తాము చేసిన బోమ్మలతో విద్యార్థులు










