Mar 07,2023 01:18
పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి దంపతులను సన్మానిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-అద్దంకి: పట్టణంలోని శ్రీరామ సుశీల నిలయంలో జరిగిన సృజన శాశ్వత సభ్యుల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. అధ్యక్షులుగా గాడేపల్లి దివాకర దత్‌, ప్రధాన కార్యదర్శిగా కేశవమటం అనిల్‌ కుమార సూరి, కోశాధికారిగా ఇలపావులూరి శేషతల్ప సాయి, ఉపాధ్యక్షులుగా సంకా సుబ్రహ్మణ్యం (బాబు), లక్కరాజు శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులుగా షేక్‌ మహమ్మద్‌ రఫీ, మలాది శ్రీనివాసరావు ప్రచార కార్యదర్శులుగా అద్దంకి లెవి ప్రసాద్‌, అనంత నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ముందుగా శ్రీమాన్‌ నారాయ ణం బాల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన సృజన కార్యవర్గ శాశ్వత సభ్యుల సమావేశం జరిగింది. గత మూడు సంవత్సరాలకు పైగా సృజన కార్యవర్గ బాధ్యతలు నిర్వహించిన పుట్టంరాజు శ్రీరామ చంద్ర మూర్తి బృందం పదవీ విరమణ చేశారు. పుట్టంరాజు శ్రీరామ చంద్రమూర్తిని, వారి కార్యవర్గ సభ్యులను సృజన ఇతోధికంగా సత్కరించింది. సృజన విశిష్ట సలహాదారులు వీరవల్లి సుబ్బారావు (రుద్రయ్య)ను గౌరవ సలహాదారులు కందుల నాగిరెడ్డి ఆత్మీయ సలహాదారులు డివిఎం సత్యనారాయణను, ఇతర శాశ్వత సభ్యులను సృజన సత్కరించింది. కాటూరి వెంకటనర్సయ్య, చుండూరి మురళీ సుధాకర్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నా రు. వీరవల్లి సుబ్బారావు, కె అనిలకుమార్‌ సూరి, జాగర్లమూడి ప్రతాప్‌, గాడేపల్లి దివాకర్‌దత్‌, డివిఎం సత్యనారాయణ, లక్క రాజు శ్రీనివాసరావు తదితరులు పుట్టంరాజు సృజన అధ్యక్షునిగా చేసిన సేవలను కొనియా డారు. పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి దంపతులను సృజన నూతన కార్యవర్గం ఘనంగా సత్కరించింది.