
ప్రజాశక్తి - జీలుగుమిల్లి
మండలాన్ని అభివృద్ధి పథంలో నడపాల్సిన మండల అధికారులు లేకుండా సర్వసభ్య సమావేశం జీలుగుమిల్లిలో బుధవారం నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల పరిషత్ అధ్యక్షురాలు కోర్స పోసమ్మ ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, సచివాలయ సిబ్బంది ఎవరూ హాజరు కాకపోవడంతో ఎదో తూతు మంత్రంగా ఖాళీ కుర్చీలతో సమావేశం నిర్వహించారు. ఖాళీ కుర్చీలు చూసి ఎంపిడిఒ కృష్ణ ప్రసాద్‌ను ప్రజా ప్రతినిధులు కొంతమంది ప్రశ్నించడంతో అందరికీ చెప్పడం జరిగిందన్నారు. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి సమావేశానికి రాని వారిపై చర్యలు తీసుకోవాలని సమావేశ హాలు నుంచి బయటకు వచ్చేశారు.