సర్వీసు రోడ్డులో నీటిలో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
ప్రజాశక్తి- మధురవాడ : సర్వీస్ రోడ్డులో వర్షపు నీటితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం సాయంత్రం పడిన వర్షంతో మధురవాడ పైవంతెన వద్ద వర్షం నీరు రోడ్డుపై చెరువును తలపించేవిధంగా ఉంది. అక్కడ కాలువలో ఉన్న మురుగునీరు రోడ్లపైకి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని వంతెన వద్ద ఉన్న కాలువలను శుభ్రపరిచి నీరు పోయే మార్గం ఏర్పాటుచేయాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.










