కడప : డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్ ఆదర్శప్రాయుడని ఆయన ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్‌బాషా అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఉప ముఖ్యమంత్రి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. రవీంద్రనాథ్, వైస్ ప్రిన్సిపాల్ రమేష్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కళాశాలలో తాను ముఖ్యఅతిథిగా రావడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. తాను కూడా 1989 నుండి 1991 వరకు ఈ కళాశాలలోనే తాను డిగ్రీ పూర్తి చేశానని చెప్పారు. ఇదే కళాశాలకు నేను ముఖ్యఅతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్ ఉపాధ్యాయ వత్తి నుంచి అంచలంచలుగా ఎదిగి ఈ దేశానికే రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి అని అన్నారు. ఉపాధ్యాయ వత్తి ఎంతో పవిత్రమైందని ప్రస్తుతం మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఆ ఘనత ఉపాధ్యాయులకే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్పొరేటర్ షేక్ మహమ్మద్ షఫీ, నాయకులు తోట కష్ణ పాల్గొన్నారు.










