Oct 14,2023 00:08

ప్రజశక్తి - చీరాల 
జగనన్న శాశ్వత భూహక్కు రీ సర్వేను వేగవంతం చేయాలని సిడిఎంఎ పి కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం రీ సర్వేపై టౌన్ ప్లానింగ్ అధికారులు, వీఆర్వోలతో ఆయన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కె రామచంద్ర రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత జగనన్న భూహక్కురి సర్వే 24మున్సిపాలిటీలో జరుగుతుందని తెలిపారు. అందులో చీరాల కూడా ఉందన్నారు. గతంలో రీ సర్వే పల్లెల్లో జరిగిందని తెలిపారు. ప్రస్తుతం పట్టణంలో కూడా రీ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. రీ సర్వే నిష్పక్షపాతంగా చేయాలన్నారు. ఈ నెలాఖరుకు చీరాల పట్టణమంతా రీ సర్వేచేసి నివేదిక ఇవ్వాలని అన్నారు. తొలి విడత రీ సర్వే పూర్తియిన వెంటనే డిసెంబర్ 23న సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా భూ హక్కుదారులకు సర్టిఫికెట్లు ప్రధానం చేస్తామన్నారు. అనంతరం వైసిపి ఇన్చార్జి కర్ణం వెంకటేష్ మాట్లాడుతూ రీ సర్వేను పకడ్బందీగా చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర రీ సర్వే ఆఫీసర్, మాజీ ఐఏఎస్ అధికారి సుబ్బారావు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు ఉన్నారు.